"వేదం" "గమ్యం" లాంటి సెన్సిబుల్ చిత్రాలు తీసిన క్రిష్ దర్శకత్వం వహించిన మూడవ సినిమా "కృష్ణం వందే జగద్గురుం".లీడర్ తరువాత తడబడుతూ ఉన్న రానా బాబుకి చావో రేవో లాంటిదీ సినిమా.
క్లుప్తంగా కథ : బళ్ళారి లో జరుగుతున్న ఇసుక మాఫియా చుట్టూ అల్లుకున్న కథ ఇది . తన తాత(కోట) చివరి కోరిక మేరకు బళ్ళారి నాటకోత్సవాలలో "కృష్ణం వందే జగద్గురుం" అనే నాటకం వేద్దామని వచ్చిన బీటెక్ బాబుకి, ఈ ఇసుక మాఫియా కూపీ లాగేందుకు వచ్చిన జర్నలిస్ట్ దేవకి కి మధ్య నడిచే ప్రేమాయణం...వారికి ఇసుక మాఫియాకి జరిగే సంఘర్షణే "కృష్ణం వందే జగద్గురుం".
ఎవరెవరు ఎలా చేసారు....?
నాటకాల్లో చెప్పే భారి పద్యాలతో మొదటి రెండు సీన్లలోనే ఆకట్టుకోడం మొదలెట్టాడు రాణా. లీడర్ తరువాత ఏ మూవీ లోనూ అలరించని రానా, ఈ "కృష్ణం" లో మాత్రం వాడుకున్నోల్లకి వాడుకున్నంత అన్నట్లు సూపర్ గా "రాణిం"చాడు. తన బాడి లాంగ్వేజ్ కి తగ్గట్టు డైలాగులు, తన బాడికి తగ్గట్టు ఫైట్లు ఎక్కువ ఉండటం తో రానా లో తడబాటే కనిపించలేదు. సో తను "వన్ ఫిలిం వండర్" కాదని ఋజువు చేసాడు.
శ్రీరామరాజ్యం తన ఆఖరి సినిమా అన్న నయనతార, ఇంకా తన అభిమానులకి చాలా బాకీ ఉందేమో...అందుకే దేవ"కి" లా వచ్చి రసజ్ఞుల హృదయాల "కీ" తెరిచింది. రానా బాబుకి తగ్గ హైటు, పర్సనాలిటి ఉండడంతో, ఇద్దరి జోడి చాలా బాగుంది.
హిందీ నటుడు మిలింద్ గునాజి ఇసుక మాఫియా డాన్ గా ఒకే అనిపించాడు. అతిగా మాట్లాడే టాక్సీ డ్రైవర్ టిప్పుసుల్తాన్ గా పోసాని ఆ అతి మాటలతో కాసేపు నవ్వించాడు. "రంపం" రంగస్థల పండిట్ గా బ్రాహ్మి ఓకే. చాల రోజుల తరువాత అన్నపూర్ణని తెర మీద చూసాం. మిగిలిన రోల్స్ లో ఎల్బి శ్రీరాం,రఘుబాబు , హేమ, సత్యం రాజేష్ బాగా చేసారు.
సమీర రెడ్డి, వెంకటేష్ మీద తీసిన ఐటెం బానే పేలింది.
మాఫియ కథ...మానవత్వం కథ...
మూవీ లో చూపించిన ఇసుక మాఫియా, మన కళ్ళ ముందు కూడా జరుగుతూ ఉండడం తో ఇంకా కనెక్టివిటీ ఎక్కువగా ఉంది. అలా ఎకారాలకి ఎకరాలు ఇసుకై పోతుంటే వామ్మో అనిపిస్తుంది. తను అనుకున్న నేపధ్యంని సిన్మా పేర్లు పడుతున్నపుడే చూపించి...ఒక్కొక్కరిగా పాత్రల్ని ఆ మెయిన్ ట్రాక్ లో కలపడం క్రిష్ ప్రత్యేకత.మరీ వేదం లో ఉన్నట్లు గుండెల్ని పిండే డైలాగులు కాకపోయినా, 'మానవత్వం, మనిషికి మనిషి సాయం' అనే విషయాలని హైలైట్ చేస్తూ రాసిన డైలాగులు బాగున్నాయి.నాటకాలకి సంభందించిన సీన్లు అలరిస్తూ వాటి ప్రాముఖ్యతని తెలుపుతాయి. నాటకాలు వేసే వారి స్థితి ఎంత దయనీయంగా ఉందొ అని బాద కూడా వేస్తుంది.
మణిశర్మ అందించిన పాటలు అన్ని స్క్రీన్ మీద సూపర్బ్. ముఖ్యంగా "జరుగుతున్నది జగన్నాటకం" అనే థీమ్ సాంగ్, ఆసాంతం వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి వెన్నముక్క లాంటిది. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైట్స్ బాగున్న...గ్రాఫిక్ వర్క్ ఇంకా బాగా చెయ్యాల్సింది...కొన్ని సీన్లు ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి.
బాగా లేని విషయాలు..
క్రిష్ సినిమా అనగానే...గమ్యం, వేదం లా హృదయానికి హత్తుకునే అంశాలు ఎక్కువ ఉంటాయి అని థియేటర్ లకి వచ్చే వారు ఎక్కువ మంది ఉంటారు. కాని కమర్షియల్ ముసుగు లో వాటిని బాగా తగ్గించి ఈ సినిమాని ఒక సాదారణ సినిమా గా మార్చాడు క్రిష్. ఫస్ట్ హాఫ్ వరకు ఉన్న టెంపో సెకండ్ హాఫ్ లో కొంచెం కొరవడింది .
ఒక జైలు సీన్లో ఒక బండ విలన్ "హీరో" ని ఉద్దేశించి .."వీడు మనలాంటోడే ...కాని వీడికి క్లారిటీ లేదు" అంటాడు . సరిగ్గా డైరెక్టర్ పరిస్థితి కూడా అంతే అయ్యింది సెకండ్ హాఫ్ లో...
హీరో పాత్రకి,విలన్ పాత్రకి ఉన్న వ్యక్తిగత కక్షని కథలో ఇరికించడం ఒకందుకు బాగున్నా, పాత సినిమాల్లో లాగా విలన్ కి ఒక వాంప్ సాంగ్, రొటీన్ క్లైమాక్స్ ఫైట్ తో సినిమా ముగించడం వల్ల, ఇది అంతకు ముందు మనల్ని అలరించిన క్రిష్ సినిమాలా లేదు.
చివరగా...
క్రిష్ అంతకు ముందు తీసిన సినిమా లా ఉంటుంది అని ఆశపడ్డవారికి ఒక 50-60% మాత్రమె నచ్చుతుందేమో. కమర్షియల్ కథా వస్తువు, రానా-నయనతారల కెమిస్ట్రీ, మంచి పాటలు, ఆకట్టుకొనే కొన్ని సీన్లు "కృష్ణం వందే జగద్గురుం" కి ప్లస్ పాయింట్స్ . అబ్బో సూపర్ అనే సినిమా కాదు కాని...పర్లేదు బాగుంది అనుకునే సినిమా..
స్కోర్
65/100