తమిళ సినిమా "తమిజ్ పదం " ఆధారం గా తీసిన సినిమా ఇది...సినిమా ఆ trailor అంచనాలని అందుకుని సూపర్ గా దూసుకుపోతున్న సందర్భంలో ..సినిమా గురించి రెండు ముక్కలు....
సుడిగాడి కథా కమీషను...!!
పుట్టగానే సిక్స్ పాక్ తో పుడతాడు మన సుడిగాడు.....తన ఒంటెలు తో విలన్ కొడుకుని చంపుతాడు...అదెలాగో సినిమాలో చూడాల్సిందే...ఇక అక్కడ నుంచి విలన్ మన హీరోని వెతకటం...విలన్ల దగ్గర నుంచి తప్పించుకుని హైదరాబాద్ని ఉచ్చ పోయిన్చాటానికి వచ్చిన సుడిగాడు ...పెద్ద హీరో గా ఎలా ఎదిగాడో తెలియాలంటే ఆద్యంతం ఈ స్పూఫుల సినిమా చూడాల్సిందే...
అల్లరి నరేష్....ద సడెన్ స్టార్ ...
"నాకు కొంచెం తిక్కుంది..దానికో లేక్కుంది.." అంటూ మెడ మీద చేతిని నిమురుతూ పవర్ స్టార్ ని....ఎవడు కొడితే మైండు బ్లాక్ అయ్యి రెడ్ గ్రీన్ బ్లాకు అవ్వుద్దో...కంఫ్యూషన్ లో నన్ను నేను కొట్టేసుకుంటా అంటూ..మహేష్ బాబు ని....కరెంటు తీగ లా సన్నగా ఉంటానని...NTR ని....ఇలా అందరిలా చేసి మనందర్నీ మెప్పించాడు అల్లరోడు...అక్కడితో ఆగాడా...8 పాక్ చూపించి సునీల్ ని ఉదికించాడు...రాజమౌళి ఆయుధాలతో ఆయనోకో చమక్ ఇచ్చాడు ...అపరిచితుడి లా మారి శంకర్ కి జలక్ ఇచ్చాడు ....అరటి తొక్క తో..సాక్స్ తో...కూడా ప్రాణాలు తీయోచని చూపించాడు...ఓవరాల్ గా అల్లరోడు అదరగొట్టాడు ...
మోనాల్ గజ్జర్ అల్లరి నరేష్ అన్ని సినిమాల లాగానే ఈ సినిమా వరకు పర్లేదనిపించే అమ్మాయి... ఆఫ్ కోర్స్ అల్లరి పక్కన చేసిన అమ్మాయిలూ ఆ సినిమా తోనే మాయం అయిపోతారు...
నరేష్ నాన్న గా నరేష్.. అమ్మ గా హేమ..బామ్మా గా కోవై సరళ ...జఫ్ఫా రెడ్డి గా బ్రాహ్మి ..తిక్కల్రెడ్డి గా జయప్రకాశ్ రెడ్డి ...నరేష్ ఫ్రెండ్స్ గా ఎమ్మెస్ , కొండవలస ,, ఎల్బి ...అండ్ నరేష్ మామ గారిలా షియాజీ..ఆయన pa గా కృష్ణ భగవాన్ ....ఒకరేంటి ఇలా అందరు ఉన్నారు...అందరు నవ్వించారు ....
బోలెడన్ని నవ్వులు...
సినిమాలో నవ్వులకి అసలు కరువే లేదు....ఒక్క హీరో అని కాకుండా...తమిళ తెలుగు హీరోల చేష్టలని సరదాగా ఆట పట్టిస్తూ ఎక్కడ బోర్ కొట్టాడు సినిమా...సీమ పురం లో తొడలు కొట్టే స్కూలు ...శివ-భవాణి పేరడీ ...ఓంకార్ పేరడీ...టీవీ సీరియల్ ఎపిసోడ్ ...అలాగే రాజమౌళి ఆయుదాలు...శంకర్ అపరిచితుడి కాన్సెప్ట్....మర్యాద రామన్న ఎపిసోడ్ ...పోకిరి ఎపిసోడ్ ..ఇలా ఒకటేంటి అన్ని highlights ఏ ....అలాగే ఎంత కామెడి సినిమా అయిన అన్ని సీన్లు పేలవు కదా..సో కొని బోర్ కోట్తోచు...బట్ నవ్వులే ఎక్కువ ...సూర్యవంశం ...సుస్వాగతం లాంటి తమిళ సినిమాల తో హిట్లు కొట్టిన భీమనేని మళ్లీ తమిళ సినిమా రిమేక్ తో హిట్టు కొట్టాడు ....అన్ని స్పూఫులతో కధ అల్లటం సులువు కాదు ...హీ ఈజ్ సూపర్బ్ ...మాటలు అద్బుతం ..పాటలు అనవసరం...ఖర్చు అల్లరోది సినిమా కి ఎక్కువే పెట్టారు...
ఫైనల్ గా చెప్పోచేదేంటంటే
తక్కువ అంచనాలతో వెళ్లి ఎక్కువ నవ్వుకున్న సినిమా ఇది...సినిమాలు ఎక్కువ చూసేవారికి ఇంకా బాగా నచ్చుతుంది ... ఈ స్పూఫు గాడు...సుపరేహే ....
రేటింగ్ ...
3.25
0 comments:
Post a Comment