స్వయంకృషి తో పై కొచ్చిన హీరోల్లో రవితేజ ఒకరు. తనకంటూ ఒక డిఫరెంట్ స్టైల్ ఏర్పరుచుకుని విజయాలు సొంతం చేసుకుని మాస్ మహారాజా అనిపించుకున్నాడు . కాని పాపం ఈ మధ్య వరస పెట్టి ఓ అర డజన్ ఫ్లాపులతో డీలా పడ్డాడు . కొంతకాలం క్రితం రవితేజ కి "డాన్ శీను " అనే ఓ మోస్తరు హిట్ నిచ్చిన గోపీచంద్ మలినేని మరో సారి బలుపు తో రవితేజ కి మునపటి హుషారు ఇచ్చాడో లేదో చూద్దాం .
కథ : మాంచి అందగత్తె అయిన శ్రుతి(హసన్) ... క్రేజీ పనులు చేసే ఆమె మావయ్య క్రేజీ మోహన్ (బ్రాహ్మి) , లవ్వు గివ్వు అంటూ బోలెడంత మంది అబ్బాయిలని బకరాలు చేస్తూ ఉంటారు . వారికి బుద్ది చెపుదామని రవి(తేజ) రంగంలోకి దిగుతాడు . సరదాగా మొదలైన ఈ డ్రామా నిజంగా ప్రేమగా మారే టైం కి ఇంటర్వెల్ బాంగ్ ..దాని తరువాత ఫ్లాష్ బ్యాక్ . ఆ ఫ్లాష్ బ్యాక్ లో అంజలి !!
సో ఈ రవి ఎవరు ? అతని కోసం "నానా"జీ( అసుతోష్ రానా ) లాంటి విల్లన్లు "నానా" విధాలు గా ఎందుకు వెతికేస్తున్నారో తెలియాలంటే మీకు కొంచెం బలుపెక్కాల్సిందే .
ఎవరి బలుపెంత ?
రవితేజ ఎప్పటి లానే తన కామెడీ టైమింగ్ తో కాసేపు ... అలాగే మాసిన గడ్డం తో సీరియస్ గా కాసేపు చెలరేగిపోయాడు . రవి తేజ వేసే పంచ్ లు ... చేసే వెటకారాలు .. చేస్తే గీస్తే రవితెజానే చేస్తేనే ఆ కిక్కు . ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కి పాత్రలో ఉన్న తేడా బానే చూపించాడు . మధ్యలో ఒక మీటింగ్ సీన్ లో బాలయ్య బాబు మీద ఉన్న అక్కసును తెలివిగా కక్కెసాడండొయి !! మొత్తంగా తన నుంచి ఎం ఆశిస్తారో ... నిరాస పరచకుండా తన బలుపు ప్రదర్శించాడు .
హిట్టు ఫ్లాపు పక్కన పెడితే .. హీరోఇన్ల విషయం లో రవితేజ సెలక్షన్ ఎప్పుడు కేకే . గబ్బర్ సింగ్ లో జస్ట్ ట్రైలర్ మాత్రమే ఒదిలిన శ్రుతి ... ఈ సారీ కళ్ళ నిండా తినిపించింది . ఫస్ట్ హాఫ్ లో చలాకి పెర్ఫార్మన్స్ తో పాటు పాటల్లో నడుముని ఊపేస్తూ మన సినిమా టికెట్ కి రెండింతలు ఖుషి చేసింది .
సీతమ్మ గా ఆకట్టుకున్న అంజలిది చిన్న పాత్రే . సీతమ్మ వాకిట్లో కలిసొచ్చిన గొంతు ఈ సారి నప్పలేదు . ఎందుకో ఆ అమ్మాయి లో తెలియని నీరసం కొట్టొచ్చినట్టు ఉంది .
అసలు హీరో తరువాత అమ్మాయిల కంటే ముందు మనం ఈ మధ్య కాలం లో మాట్లాడుకోవాల్సింది బ్రాహ్మి రోల్ గురించి . ఈ సినిమాలో చేసిన క్రేజీ మోహన్ తరహ పాత్ర, రవితేజ తో చెంప దెబ్బలు తినడం ఇప్పటికి ఓ పది సినిమాల్లో చూసుంటాం ..కాని తమన్ ట్యూన్స్ లా ఇన్స్టంట్ గా నచ్చేస్తాయి . తరువాత గుర్తుకు రావు . "సావిత్రి" గా ఆలి పాత్ర కి ఆ పెరోక్కటే కొంచెం కామెడీ గా ఉంది .
ప్రకాష్ రాజు పాత్ర హీరో కి తండ్రి పాత్ర . కొంచెం ట్విస్ట్ ఉన్న రోల్ . ప్రకాష్ రాజ్ వెరైటీ కోసం పుట్టాడు . రొటీన్ గా చెయ్యటం పాపం ఆయనకీ కూడా కష్టంగానే ఉండొచ్చు .
అశుతోష్ రానాని మొన్నేగా తడాకా లో చూసాం .. షూటింగ్ ఒకేసారి చేసేసుంటారు .. కనీసం బట్టల్లో కూడా తేడా లేదు . అడివి శేషుది కరివేపాకు రోలే . నాజర్ నుంచి తాగుబోతు రమేష్ వరకు ఇంకా ఓ డజన్ మంది మంచి ఆర్టిస్ట్ లు ఉన్నారు .
ఇందుగలడు అందు లేడు అను సందేహంబు వలదు అన్నట్లు "పవన్" ని వాడుకొని సినిమా లేదేమో .... పవర్ స్టారా మజాకా !!
ఇందుగలడు అందు లేడు అను సందేహంబు వలదు అన్నట్లు "పవన్" ని వాడుకొని సినిమా లేదేమో .... పవర్ స్టారా మజాకా !!
సగసగాలు ...
మొదటి సగం - శ్రుతి అందాలు .. క్రేజీ మోహన్ క్రేజీ పనులు , రవితేజ రిటొర్ట్ ల తో బానే కాలక్షేపం అయిపొయింది . ముఖ్యంగా సంభాషణలు ట్రెండి గా ఉండటం తో హాయిగానే అనిపించింది . ఈ సగం లో విల్లన్లు కొంచెం రెస్ట్ తీసుకోటం తో మనకి ప్రశాంతంగా ఉంటుంది .
ఇక రెండో సగం ఇంటర్వెల్ లో విల్లన్లు విరుచుపడగానే నా వెనుక ఉన్న ఎవరో అక్కడున్న ట్విస్ట్ కూడా ఊహించేసాడు . ఓ గుండాగిరి ఫ్లాష్ బ్యాక్ .. SP బాలు పాడిన ఓ యుగళ గీతం ... అంజలి తో హీరో చెట్ట పట్టాలు వేసుకుంటూ హీరో తిరగడం ( ట్రైలర్ చూసే ఉంటారు గా ) .. సో మీ ఉహలకి అందనంత దూరం గా ఏముండదు ఆ ఫ్లాష్ బ్యాక్ . తెలిసిన కథనే ఇంకొంచెం సాగ తీసినట్లు అనిపించింది ఇక్కడ .
ఆకట్టుకునే విషయం ... దర్శకుడు క్లైమాక్స్ మీద కొంచెం మనసు పెట్టాడు ... ఫ్లాష్ బ్యాక్ నుంచి బయటకు రాగానే ఎలాగో ఓ మసాలా డ్యూయెట్ , లాస్ట్ ఫైట్ రొటీన్ అనుకోండి ...కాకపొతె ఆ ఫైట్ లో సరదా గా విల్లన్ల తో కూడా డాన్సు చేయించటం బాగుంది .
టెక్నికల్ టింగ్స్ ...
రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో గోపీచంద్ సినిమాలు బానే తీయగలడు . బట్ ఎప్పుడు రెగ్యులర్ గా తీస్తే నిలదక్కుకోడం కష్టం . తన వరకు తనకిచ్చిన కథ ని బానే చెప్పాడు . బాబీ అనే అతను ఇచ్చిన కథ లో పెద్ద విశేషం ఎం లేదు . తమన్ పాటలు ఇంకో రెండు వారాలు వినిపిస్తాయి . బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్కడయ్యా తమన్ ?? డైలాగ్స్ బాగున్నాయి .
చివరగా ...
వీకెండ్ వచ్చిన సినిమా అల్లా చూసే అలవాటుండి .. సినిమా ఓ మాదిరి గా పర్లేదనిపించేలా ఉన్నా మీకు పర్లేదు అనిపిస్తే ఓ సారి చూడొచ్చు . రవితేజ మార్క్ కామెడీ , క్రేజీ మోహన్ బాధలు ... శ్రుతి హసన్ తళుకులు మీకు నచ్చే అవకాశాలు ఉన్నాయి .
రేటింగ్
61/100
0 comments:
Post a Comment