కొన్ని కాంబినేషన్ లు కలవడం లోనే విజయాలు ఖరారైపోతాయి .. ఒకప్పుడు బి గోపాల్ బాలయ్య కాంబినేషన్ ఎంత పాపులరో .. ఇప్పుడు బోయపాటి - బాలయ్య కలయిక అంతే . హిట్టు కి హిట్టు కొంత గ్యాప్ ఇచ్చే బలయ్యకి మరో బ్లాక్ బస్టర్ టైం ఒచ్చింది అని అభిమానులు బలంగా నమ్మారు.. ఈ సమ్మర్ లో అతి పెద్ద సినిమా .. అలాగే నిప్పుకి గాలి తోడైనట్టు .. బాలయ్య ప్రతాపానికి ఎలక్షన్ల వేడి సహకరించటం తో మొదటి ఆట నుండే "లెజెండ్" సినిమా ఊపు అందుకుంటోంది .
కథ
కుటుంబానికి దూరంగా దుబాయ్ లో ఉండే సిదార్ధ ( చిట్టి బాలయ్య) తను ప్రేమించిన అమ్మాయి ని వెంటబెట్టుకొని ఇండియా ఒస్తాడు . వైజాగ్ లో అడుగు పెట్టగానే అక్కడి లోకల్ డాన్ జితేంద్ర ( జగపతి) కొడుకుతో తగాదా పడతాడు . సిద్ధార్ధ ని వెతికే చంపుదామనుకున్న సమయంలో జయదేవ్ ( పెద్ద బాలయ్య) సింహం లా ఎంటరవుతాడు .. ఇంతకీ సిద్దార్ధ కి జైదేవ్ ఏమవుతాడు .. జయదేవ్-జితేంద్రల పగ తాలూకు ఫ్లాష్ బ్యాక్ రెండో సగం ...
బాలయ్యా .... మజాకా
బాలయ్య కి ఎలాంటి డైలాగులు పడాలి ... బాలయ్య ఎలాంటి విగ్గు వెయ్యాలి .. ఎలాంటి కథ రాయాలి .. ఇవి తెలిసిన డైరెక్టర్లని వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు . బోయపాటి వాటిల్లో Phd చేసుంటాడు . సింహ లో రెండు పాత్రలు మీద మనసు పెట్టిన బోయపాటి ఈసారి మొత్తం రెండో హాఫ్ లో ఉన్న జయదేవ్ మీదే ప్రాణం పెట్టాడు ... సీరియస్ ఎమోషన్స్ .. సెంటిమెంట్ సీన్స్ లో తనని మించిన హీరో లేడు అనేంత లా బాలయ్య బాబు ఈ సినిమాలో విజ్రంబించాడు . మొదటి సగం లోది చిన్న రోల్ అయినా బ్రహ్మానందం , హీరోయిన్ తో నడిచే కామెడీ ట్రాక్ లో పరవాలేదనిపించాడు . ఇంటర్వెల్ నుంచి ఇంకో లోకం లోకి తీసుకెళతాడు బాలయ్య . "చూడు నన్నే చూడు " అనేలా దాదాపు అంతా తానే అయ్యాడు ... ఆడవారి గురించి చెప్పే సీన్ .. అలాగే మరదలి తో ఒచ్చే భారి సెంటిమెంట్ సీన్ , జగపతి తో పోలీస్ స్టేషన్ ముందు సీన్ ..బాగా పండాయి .
డైలాగులు .. ఫైట్లు .. నేపధ్య సంగీతం
ట్రైలర్ లో డైలాగులు జస్ట్ శాంపిల్ లో పదో వంతే ... సినిమాలో పదునైన మాటలు కోకొల్లలు రాసారు ఎమ్. రత్నం .. " నీకు BP ఒస్తే నీ PA భయపడతాడెమొ .. నాకు బప్ ఒస్తే AP షేక్ అవుద్ది .. రాజకీయం నీ ఫుడ్డు లో ఉందేమో .. నాకు బ్లడ్ లోనే ఉంది రా బ్లెడి ఫూల్ .. నీ జీవితం ఢిల్లీ నుంచి వచ్చే cover లో ఉందేమో .. నా బలం నాకున్న power లో ఉంది . "అయినవాళ్ళకి ఎమన్నా అయితే అరగంట పట్టుద్దేమో కాని .. ఆడపిల్ల ఆపదలో ఉంటె ఆ క్షణంలో ఒస్తా " అతడికి జనం అనే మాట వినిపిస్తే మనం నేది మర్చిపోతాడు " అబ్బో బాలయిసమ్ అనే బూక్కు రాయోచు . లాస్ట్ లో పొలిటికల్ లీడర్ అంటాడు .. సచిన్ ఫీల్డ్ లో దిగితే 100 రన్స్ కొట్టాలి ... అదే రాజకీయ నాయకుడు కనీసం 100 C నొక్కాలి ... అనేది జనం ఫిక్స్ అయిపోయారని ..
ఇంటర్వెల్ ముందు ఫైట్ .. గుర్రం మీద ఫైట్ .. రైల్వే ట్రాక్ మీద ఓ ఎమోషనల్ ఫైట్ ఒకటికి మించింది ఇంకోటి .. పాటలు పెద్ద గొప్పగా ఇవ్వాలేదు కాని .. దేవిశ్రీ కనీసం బ్యాక్ గ్రౌండ్ బాగా ఇచ్చాడు .
ఫామిలీ హీరో గా చేసిన జగపతి బాబు ఇంత విలనీ చేయటం గొప్ప విషయం . కానీ డైరెక్టర్ ఎక్కడా కూడా జగపతికి పై చెయ్యి ఇవ్వలేదు . సినిమాలో జయప్రకాశ్ చెప్పినట్టు ఎప్పుడో పోయేవాడు ఏదో విధంగా చివరిదాకా బండి లాగినట్టు అనిపించింది రోల్ .
సోనాల్ చౌహాన్ పర్లేదు .. మరి సినిమాలు ఒస్తాయొ రావో తెలిదు . రాధిక ఆప్టే కూడా పర్లెదు.. నయనతారకి ఉన్నంత గొప్ప రోల్ కాదు . కె. ఆర్. విజయ ప్లేస్ లో కొత్త బామ్మ ఒచ్చింది .
చివరగా
సింహ లాంటి ఫార్ములా కథ .. దాని చుట్టు అల్లుకున్న అలాంటి స్క్రీన్ ప్లే .. అందుకే ఏ సీన్ కూడా ఇది భలే కొత్తగా ఉందే అనిపించదు .. కానీ ఎలక్షన్ టైం ఒచ్చేసరికి రాజకీయ నాయకులు చేసిన చెత్త పనులు మనం ఎలా మర్చిపోతామో .. ప్రేక్షకుడి గా పాత సినిమాలో చూసిన విషయాలు కొత్త బొమ్మ థియేటర్లో పడగానే మర్చిపోతాం .. బాలయ్య అంటే ఇష్టపడేవారు కోరుకునే సినిమా .. సంక్రాంతి సీజన్లో తరువాత చూడదగ్గ పెద్ద సినిమా ..
రాజకీయానికి సంబందించిన ఎపిసోడ్ సినిమా కి ఎక్కువైనా .. ఈ ఎలక్షన్ టైం లో సూపర్ గా పండింది . పెద్ద ఎన్టీఆర్ క్లిప్పింగ్స్ కేక
రేటింగ్
65/100
అడ్వాన్సు గా చెప్పేస్తున్నా .. "జయ" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
0 comments:
Post a Comment