నందమూరి కళ్యాణ్ రాం కి ... "అతనొక్కడే" సినిమా తరువాత మరో మంచి హిట్టు రావాలని కేవలం నందమూరి అభిమానులే కాదు .. ఇంకా ఎంతో మంది కోరుకొని ఉంటారు .. !! కాని హిట్టు ఎవరో కోరుకుంటే రాదు ... అలా వచ్చెయ్యలంతే .. ఓ "పటాస్" లాగ ..!!
కథ మామూలే ...
జీవితం లోజరిగిన కొన్ని చేదు అనుభవాలతో అవినీతి పోలీస్ ఆఫీసర్ గా మారిన హీరో .. ఇంటర్వెల్ టైం కి ఎలా తిక్క రేగి సరైన రూట్లోకి వచ్చి విలన్ల పంబ రేపుతాడో అనేది పటాస్ కథ ..
కళ్యాణ్ రామ్ .. ఫస్ట్ నుంచి లాస్టు దాకా....
కళ్యాణ్ రామ్ ఇంత హుషారుగా ఎప్పుడు చెయ్యలేదు .. అది క్యారెక్టర్ మహిమో .. డైరెక్టర్ పనితనమో , కష్ట పడి .. ఇష్ట పడి చాలా చలాకి గా చాలా పవర్ఫుల్ గా చేసాడు "పటాస్ " లాంటి పోలీస్ పాత్రని . నందమూరి అభిమానులు తనకి దూరం అవుతున్నారేమో అని భయమో ఏంటో .. Jr ఎన్టీఆర్ తో వాయిస్ ఓవర్, బాలయ్య బాబు పాట రీమిక్స్ , హరికృష్ణ సీతయ్య సీను , ఓ ఫైట్ లో ఎన్టీఆర్ విగ్రహం ..ఇలా అన్ని లైఫ్ లైన్స్ వాడేసాడు ...
శ్రుతి సోడి ..ఇంకో రివ్యూ లో ఈ అమ్మాయి పేరు మనం చదువుతామో లేదో మరి ?? ఈ హీరోయిన్ ప్లేస్ లో ఏ రకుల్ ఓ రెజినా నో చేసుంటే బాగుండేది ..
సునామి స్టార్ సుబాష్ అలియాస్ మైలవరపు సూర్యనారాయణ ( మనం ముద్దు గా ఎమ్మెస్ నారాయణ అంటాం) మనల్ని పక పక నవ్విస్తూనే .. దూరంగా వెళ్లి ఏడిపించారు సార్ !!
శ్రీనివాస్ "రెడ్డి గారు " ,వాచకం .. నటన రెండు ఉన్న మంచి కమెడియన్ ... సాయి కుమార్ది కూడా మంచి పాత్రే .. కాక పోతే ఒక్క సీన్ ఇచ్చారు మంచిది . అసుతోష్ రానా పర్లేదు .. పోసాని రోల్ బాగుంది .
కొత్తోడు .. కొట్టాడు .. అనిల్ రావిపూడి ..
ఒకే ప్రేమ కథ ని పది రకాలుగా పది మంది దర్శకులు ఆకట్టుకునేలా చెప్పగలరు .. అలాగే ఒకే పోలీస్ కథ ని ఒక్కో డైరెక్టర్ ఒక్కో లా కుమ్మేయగలడు .. తండ్రి కొడుకు సెంటిమెంట్ .. అన్న చెల్లి సెంటిమెంట్ .. చాలా సింపుల్ గా హత్తుకునేలా చెప్పాడు. "801" సర్వీస్ , హీరోయిన్ కోసం ప్రెస్ మీట్లు etc etc తో ఫస్ట్ హాఫ్ ఫాస్ట్ గా గడిచిపోయింది . ఇంటర్వెల్ ట్విస్ట్ ఓ మాదిరిగా ఉంది .. ఎవరైనా ఊహించొచ్చు .
ఇది కథ అని తెలిసాక కూడా పవర్ఫుల్ డైలాగులతో .. సరైన కామెడీ తో చక చక సినిమాని నడిపించటం "పటాస్" ప్లస్ పాయింట్ .. కురాన్ కి అర్ధం చెప్పే ముస్లిం ఎపిసోడ్ .. " మదర్స ఎపిసోడ్" హైలైట్స్ .
ఎం బాలేదంటే ..
సాదారణంగా రీమిక్స్ దండగ .. పాట ఖూనీ అయ్యింది అనుకుంటాం .. కాని సాయి కార్తీక్ సొంత పాటల కంటే ఈ సినిమా లాస్ట్ సాంగ్ .. బాలయ్య బాబు అరె ఓ సాంబ నే కేక . సో పాటలు హీరోయిన్ బాగుండాల్సింది .
ఫైనల్లీ ..
చాలా కాలం తరువాత ఓ హిట్టు కొట్టాడు కాబట్టి తీరిక చేసుకుని థియేటర్ కి వెళ్లి ఈ కళ్యాణ రాముడికి కంగ్రాట్స్ చెబుదాం !!
రేటింగ్ 65/100
My new twitter handle @chakrireview ( I promise only 1 post per movie, the review link)
My new twitter handle @chakrireview ( I promise only 1 post per movie, the review link)
0 comments:
Post a Comment