అన్నిఉన్నా .. అల్లుడి నోట్లో శని .. అనే ఓ సామెత ఉండేది .. అలాంటి మన లాంటొల్లలొ ఎన్టీఆర్ ఒకరు .. అతి పిన్న వయసులోనే గొప్ప విజయాలు అందుకున్న చిన్న ఎన్టీవోడు .. ఈ మధ్య కాలం ఒకటి అరా మోస్తరు సినిమాలు తో సరిపెట్టుకున్నాడు .. ఎన్నాళ్ళో ఎదురు చూసిన 'బంపర్' హిట్టు 'టెంపర్' తో వచ్చిందని తోలి రోజు టాక్ ..
మనకి తెలీని కథెం కాదు : సినిమాకో కథ ఎక్కడ పుట్టుకొస్తుంది చెప్పండి .. ఓ లంచగొండి పోలీస్ .. ఒక దారుణమైన సంగటణ .. హీరోలో మార్పు .. అరె ఈ సినిమా మొన్నే చూసాం అనిపించిందా అనిపిస్తే అనిపియ్యనివ్వండి .. కాని తెలిసిన కథ నే సూటిగా చెప్పి తరువాత ఎం జరుగుతుంది అని అనిపించేలా చెయ్యటం ఈ డైరెక్టర్ కి "పూరి" తో పెట్టిన విద్య ..
పూరి .. నందమూరి !!
అదుర్స్ లో నవ్వించాడు .. రాఖి లో విజ్రంబించాడు .. పూరి హీరోల్లో ఉండే ఓ ఈజ్,తిక్క .. అలాగే ఎన్టీవోడు లో ఉండే ఓ కసి,ఆవేశం రెండు సమపాళ్ళలో కలిసాయి ఇన్స్పెక్టర్ దయ లో .. ఓ మా చెడ్డ పోలీస్ లా చెయ్యటమే ఎన్టీఆర్ కి కొత్త .. అలా చెడుని కూడా స్టైల్ గా చేసుకుంటూ .. సరైన టైం లో రివర్స్ గేర్ వేసే పాత్ర లో ఎన్టీఆర్ చెలరేగిపోయాడు .. ఫాన్స్ దిల్ కుష్ చేసాడు ..!!
మొదటి సారి తను రాసిన కధ కాకుండా వక్కంతం వంశి కథ తో సినిమా తీసాడు పూరి జగన్నాథ్ .. ఈ మధ్య ఆయన కథనాల్లో ఓ కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది .. కాని ఈ సారి ఓ దేవుడి దండలో పూలు గుచ్చినంత అందంగా సన్నివేశాలు పేర్చాడు .. ఫస్టాఫ్ లో వచ్చే సీన్స్ ని రెండో సగం లో సింక్ చేస్తూ .. హీరోలో మార్పు మెప్పించేలా చూపించి .. క్లైమాక్స్ లో ఈ సమస్య కి పరిష్కారం .. ఇన్ని సినిమాలు చూసిన ఓ ప్రేక్షకుడు ఊహించని విధంగా చెప్పి శభాష్ అనిపించుకున్నాడు .
ఏ హీరో తో సూపర్బ్ కెమిస్ట్రీ ఉండే విలనీ ప్రకాష్ రాజ్ కి వరం . పోసాని కృష్ణమురళి గారిది హీరో ని హీరో గా చేసే అద్బుతమైన పాత్ర . హీరోని పెళ్లున చెంపదెబ్బ కొట్టాలంటే అది తనికెళ్ళ భరణి గారు కొడితేనే కిక్కు .
ఇన్ని సినిమాలు చేసినా ఇంకా చూడముద్దొస్తుంది కాబట్టే కాజల్ ఒక్కో హీరోతో రెండేసి మూడేసి తీస్కుంటూ పోతుంది .. వెన్నెల కిషోర్ నవ్విస్తూ అయ్యో పాపం అనిపించాడు. ఆలి , రఘుబాబు , సప్తగిరి ఫస్టాఫ్ కవర్ చేసారు !!
మ్యూజిక్ సిస్టం .. ( ఈ హెడ్డింగ్ సినిమా చూస్తె తెలుస్తుంది )
అనూప్ పాటలు బాగున్నాయి సినిమా ఫ్లో లో కరెక్ట్ గా కుదిరాయి . మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని సినిమా లో లీనం చేసింది ..
చివరగా ..
ఓ పెద్ద హీరో సినిమా చూసి ఓ రెండు మూడు వారాలు అయ్యింది కాబట్టి .. కొంచెం కామెడి ... ఓ నాలుగు మాంచి సాంగ్స్ .. కావలసినంత ఎన్టీఆర్ .. కొంచెం మీ మూడ్ ని టెంపర్ తో నింపుకుంటే టెంపర్ నచ్చే ఛాన్స్ ఉంది .. ట్రై చెయ్యొచ్చు ..
రేటింగ్
65 +5 కరెక్ట్ గా వర్కౌట్ అయ్యిన కాంబినేషన్ కోసం !!
Follow my twitter handle @chakrireview https://twitter.com/chakrireview
0 comments:
Post a Comment