వరల్డ్ కప్ అయిపొయింది .. ఎగ్జామ్స్ అయిపోయాయి .. ఇక మిగిలిన మండే ఎండల్లో మనకి రిలీఫ్ ఇచ్చేవి రెండే రెండు .. ఒకటి IPL .. రెండోది సినిమాలు ... ఈ సమ్మర్ కి మొట్టమొదటి భారి సినిమా
S/O సత్యమూర్తి . డైరెక్టర్ త్రివిక్రమ్ "అత్తారింటికి దారేది" హీరో అల్లు అర్జున్ "రేసుగుర్రం" రెండు బ్లాక్ బస్టర్లే . సో ఆటోమేటిగ్గా ఈ సత్యమూర్తి గారబ్బాయి మీద అంచనాలు సూపర్ గానే ఉన్నాయి ..
రివ్యూ లో కథ చెప్పకూడదు కదండీ ..సో !!
మేటర్ ఏంటంటే తన తండ్రి పేరు నిలబెట్టడానికి ఓ కొడుకు చేసే ప్రయత్నం .. తద్వారా తండ్రి నేర్పిన విలువల యొక్క విలువ తెలుసుకుని.. కోరుకున్న అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడనెదే సినిమా ..
సినిమాలో స్టార్స్ గురించి చకా చకా ...
విరాజ్ ఆనంద్ .. ఇది సినిమాలో అల్లు అర్జున్ పేరు.. కొంచెం చలాకీ .. కొంచెం ఎమోషన్ మిక్స్ చేసిన రోల్ . ఇంత కంటే సూపర్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ లు ఇప్పటికే బోలెడు చేసాడు బన్ని .. సో ఈ సినిమాకి కొత్తగా ఉంది అంటే హెయిర్ స్టైల్ ఒక్కటే ..!!
ఈ సినిమాకి "ప్రత్యేక" బలం ఉపేంద్ర. అతని యాస, నటన .. ఆయన చేసిన ప్రతి సీన్ యొక్క స్థాయిని పెంచాయి .. స్నేహ బాగుంది .. "సూపర్ మచ్చి" పల్లవి కి డాన్సు సూపర్ గా చేసింది . డబ్బు పిచ్చోడి గా రాజేంద్ర ప్రసాద్ బాగా చేసారు . ఆలి ఆసాంతం సపోర్ట్ గా నిలిచాడు . ఎమ్మెస్ గారిని మరో సారి చూసాం సంతోషం ..!! బ్రహ్మానందం గారిని ఈ రోల్ లో ఒక 786 సినిమాలు చూసుంటాం .. మల్లి అదే చేపించడం .. ఇక ఎం చెయ్యలేం ...
ముగ్గురి హీరోయిన్లలో మెయిన్ సమాంత .. ఎందుకంటే ఆమెకే హీరోతో ఫుల్ సాంగ్ ఇచ్చారు కాబట్టి . .. అంతకు మించి ఆమె చేసిందేమీ లేదు .. నిత్య మీనన్ ఇంట్రడక్షన్ లో అమ్మో సినిమాలో ఈమె ట్విస్ట్ అనిపిస్తుంది కాని ఆమెని అంతెం వాడుకోలేదు ... ఇంకో అమ్మాయి అదా శర్మ రోల్ గెస్ట్ రోల్ కి ఎక్కువ .. సెకండ్ హీరోయిన్ కి తక్కువ
విలువలు జాస్తి .. కొత్తదనం నాస్తి ..
రాముడు కేవలం ఒక్క చాకలి వాడి మాటకి విలువిచ్చి ఎం సాదించాడు .. రావణుడు సీత ని వదులుకోకుండా ఎం కోల్పోయాడు .. ఇలా మన పురాణాల్లో నుండే మన సినిమా కథలు పుట్టుకొస్తాయి అని హీరో తో చాలా చక్కటి ఉదాహరణలు ఎన్నో చెప్పించారు త్రివిక్రమ్ .. ఎక్కువగా అమ్మ సెంటిమెంట్ .. చెల్లి సెంటిమెంట్ చూస్తాం .. కాని నాన్న పంచే విలువని కథలో అంతర్లీనం గా బాగా చెప్పించాడు ..
కాని అదే పని గా .. ఒకే లాంటి కథనం .. ఫారిన్/సిటీ లో ఉండే హీరో.. ఇద్దరు అమ్మాయిలు ఓ పార్టీ సాంగ్ .. ఇంటర్వెల్ లో సమస్య .. ఒకే ఇంటిలో గుంపుగా చేరడం .. చివర్లో బ్రహ్మానందం .. త్రివిక్రమ్ గారి సినిమాలతో పోల్చినా అత్తారింటికి చాయలు ఎక్కువ కనిపిస్తాయి .. ఆ కథలో ఉన్నంత పట్టు ఇక్కడ లేదు ..
టెక్నికల్ గా
సాంగ్స్ బానే ఉన్నాయి .. సినిమా నిండుగా కలర్ ఫుల్ గా ఉంది ..
ఫైనల్ గా
ఎమోషనల్ గా ఉండే సీన్స్ తో ఆకట్టుకునే సంభాషణలతో టైటిల్ని ఫుల్లుగా జస్టిఫై చేసారు త్రివిక్రమ్ .. అలాగే కొత్తదనం రవ్వంతైనా లేకుండా నిరాశ కూడా పరిచారు .. కాని టైం పాస్ కోసం .. ఓ భారి సినిమా చూసాం అనే తృప్తి కోసం ఓ సారి చూసేయోచ్చు .. ఎందుకంటే సమ్మర్ కి "సినిమాలే ఆస్తి " ..:)
రేటింగ్ ..
61.125 /100 రేటింగ్ కూడా రొటీన్గా ఎందుకులే అని ..:)
0 comments:
Post a Comment