సమ్మర్ సినిమాల సందడి మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ "బాద్షా" తో ఇవ్వాళ లాంచనంగా ప్రారంభమయ్యింది . మామూలు బాద్షా అంటే ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గారికి కోపం రావొచ్చు సో దీన్ని బ్లాక్ బస్టర్ బాద్షా అనే పిలవాలి . యంగ్ హీరోలందరూ తలా ఒక సినిమాని 40 కోట్లు దాటించేసారు . ఇక మన బుడ్దోడిదే బాకీ . అందుకే ఒక దూకుడు బ్లాక్ బస్టర్ దర్శకుడు .. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ , అలాగే బ్లాక్ బస్టర్ హీరోయిన్ కాజల్ అండ్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చే తమన్ ... సో ఇంత మంది బ్లాక్ బస్టర్లు కలిసిన మన బ్లాక్ బస్టర్ బాద్షా ఎలా ఉందొ ఒక లుక్కేద్దాం .
కథ..(కంగారు పడకండి మొత్తం చెప్పెయనులే సినిమా చూద్దురుగాని)
మన హీరో బాద్షా ఒక మాఫియా డాన్ . చిన్న చిన్న డాన్లందర్నీ గెలిచి ఫైనల్ గా మన హెలికాప్టర్ విలన్ అదేనండి కెల్లి జార్జ్ ( ఈయన ఓన్లీ హెలికాప్టర్ లే ఎక్కుతాడులే ) తో పెట్టుకుంటాడు .
కట్ చేస్తే మన హీరో రామారావు (మామూలు రామా రావు కాదండోయ్ ఎన్టీరామారావు )గా మారి ఇటలీ లో ఉన్న మన హీరోయిన్ బంతి పూల జానకి కి లైన్ ఇస్తాడు . ఆమె పెళ్లి చెడకొట్టటానికి ఆమెతో పాటు ఇండియా ఒస్తాడు . ఇక తెలిసిందే గా శ్రీనువైట్ల గ్యాంగ్ మొత్తం అక్కడ సిద్దంగా ఉంటారు కామెడీ కోసం .
సో హంగ్ కాంగ్ లో ఉన్న కెల్లి జార్జ్ కోసం ఇటలీ లో ఉన్న పాప ని ఎందుకు పటాయించాడో తెలుసుకోవాలంటే ఈ వీకెండ్ మీరు బ్లాక్ బస్టర్ బాద్షా అర్జెంటు గా చూసేయ్యాలి .
బ్లాక్ బస్టర్ నటినటులు :
ఎన్టీఆర్ చాలా ఫ్రెష్ గా ఉన్నాడు . చాలా షాట్స్ లో అందంగా ఉన్నాడు . "సైరో సైరో " "వెల్కమ్ కనకం " " బంతి పూల జానకి " ఇలా అన్ని పాటల్లో డాన్సు కుమ్మేసాడు . కామెడీ ఎన్టీఆర్ కి కొత్త కాదు. అంతకు ముందు చారి లా చించేసాడు . ఈ సారి కూడా చాలా బాగా చేసాడు . ఇక జస్టిస్ చౌదరి గెటప్ లో తాతని గుర్తుకుతెచ్చాడు . కొన్ని రీమిక్స్ పాటలకి తాత స్టెప్పులు కూడా వేసాడు . ఓ రకంగా చెప్పాలంటే ఫాన్స్ కి ఈ సారి బావర్చి బిర్యానీ వడ్డించాడు .
ఇక కాజల్ .. ఇన్ని సినిమాల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఊరికే పోలేదు . ఫస్ట్ హాఫ్ మొత్తం తన "బంతి" ఫిలాసఫీ తో బాగా నడిపించింది . సెకండ్ హాఫ్ పాపం హీరోయిన్ పోసిషన్ ఓన్లీ సాంగ్స్ కి అని గుర్తొచింది డైరెక్టర్ కి . ఓవరాల్ కాజల్ టూ గుడ్ .
ఆయుధం లేకుండా రాజమౌళి సినిమా తీస్తాడేమో కాని బ్రహ్మానందం అండ్ ఎమ్మెస్ లేకుండా శ్రీనువైట్ల సినిమా తీయ్యడేమో !!
ఎమ్మెస్ ది రివెంజ్ నాగేశ్వరరావు అనే డైరెక్టర్ రోల్ . తన పిచ్చి సినిమాలతో ప్రేక్షకుల మీద "రివెంజ్" తీస్కుంటాడన్న మాట . మాట్లాడితే ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యమనే క్యారెక్టర్ ని చూస్తె మనకి RGV గారు గుర్తొస్తారు . దూకుడు అంత గొప్ప రోల్ కాదు బట్ ఫైన్ .
ఇక బ్రాహ్మి ది పిల్లి పద్మనాభ సింహ - పేరు కి ముందు పిల్లి వెనుక సింహ ఉన్నాయంటే ఆ పేరుకి ఒక కథ ఉంది లెండి . ఇంచుమించు రెడీ అండ్ దూకుడు లో చేసిన రోలే . ఈ సారి ఇంసేప్షన్ కాన్సెప్ట్ లో "కల" లో జీవించే క్యారెక్టర్ . సెకండ్ హాఫ్ మొత్తం తన భుజాల మీద ఎస్కున్నాడు ఒక్క మాటలో . ఆయన పేరులోనే ఆనందం ఉంది మరి నవ్వక ఎం చేస్తాం ..
ఈ సారి మన సుధా ఆంటీ, ప్రగతి ఆంటీ , సురేకావాని అండ్ సత్య ఐటెం గర్ల్స్ కంటే బ్రహ్మాండంగా డాన్సులు వేసారు . నవదీప్ బకరా పెళ్ళికొడుకు లా చేసాడు . జస్ట్ ఓకే . సిద్దార్ధ్ ది చిన్నదే కాని అవసరమైన పాత్ర . నాజర్ షరా మామూలే పిల్ల తండ్రి . వెన్నెల కిషోర్ దర్సకత్వం లాంటివి చెయ్యకుండా ఇలా హ్యాపీ ఆ సపోర్టింగ్ రోల్స్ చేస్కోడం బెటర్ .
బ్లాక్ బస్టర్ లక్షణాలు :
ఫస్ట్ హాఫ్ లో కాజల్-ఎన్టీఆర్ లవ్ ట్రాక్ బాగా పండింది . ఇక ఎమ్మెస్ కామెడీ ఇప్పటి డైరెక్టర్స్ ని అనుకరిస్తూ చక్కగా నవ్వించింది . ఇటలీ అందాలు ఓ మూడు మంచి పాటలతో చాలా సింపుల్ గా ఫస్ట్ హాఫ్ అయిపొయింది . ఈ హాఫ్ లో కొంచెం మాఫియా గోల ఎక్కువయ్యింది . రెండు మూడు గ్యాంగ్లు ..పిచ్చి ఫైట్ లు ..తప్పదు ఓపిక పట్టాలి .
ఇక సెకండ్ హాఫ్ తో కామెడీ గ్యాంగ్ మొత్తం హైదరాబాద్ లో రెడీ . అంతా హీరోయిన్ ఫామిలీ . బ్రహ్మానందం పాత్ర క్లిక్ అయితే తెలిన్దేముంది . నవ్వులే హాల్ మొత్తం . ఒకే లాంటి పాత్ర తో మళ్ళి మళ్ళి నవ్వించడం మామూలు విషయం కాదు . ఈ విషయం లో మాత్రం రైటర్స్ టీం కోన వెంకట్ అండ్ గోపి మోహన్ ని అభినందించాలి . వారు రాసిన పంచ్ డైలాగ్స్ బాగా పేలాయి . అలాగే ఎన్టీఆర్ గర్ల్స్ మీద చేసే ఫుల్ లెంగ్త్ సీన్ ... బ్రాహ్మి సింహ డైలాగ్ సూపర్ .
తమన్ పాటలు వినగా వినగా నచ్చాయి . స్క్రీన్ మీద అన్ని బాగున్నాయి . గుహన్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది .
ఆ మర్చిపోయానండోయి మన మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఒక ప్లస్ ( ఇటలీ లో చావ్ చావ్ గురించి చెప్పెపుడు ఒక ముసి నవ్వొస్తుంది మీకు )
ఆ మర్చిపోయానండోయి మన మహేష్ బాబు వాయిస్ ఓవర్ కూడా ఒక ప్లస్ ( ఇటలీ లో చావ్ చావ్ గురించి చెప్పెపుడు ఒక ముసి నవ్వొస్తుంది మీకు )
లోటు పాట్లు
శ్రీను వైట్ల సినిమా ఫార్మాట్ మనకి తెలుసు . హిట్ కోసం చూస్తున్న ఎన్టీఆర్ కి ఇప్పుడు ప్రయోగాలు చేసే తీరిక లేదు . సో పూర్తిగా దూకుడు లాంటి వంటకాన్నే దీనికి సిద్దం చేయించుకున్నాడు . ఎప్పుడు అన్ని పాత్రలకి న్యాయం చేసే శ్రీను గారు ఈసారి మొత్తం బ్రాహ్మి మీదే కథ నడిపించాడు . భారీ కథనం ... ముక్యంగా ఆ డాన్ల గోల కొంచెం నస పెడుతుంది . భోజనం చేసాక డిసర్ట్ లేకపోతె మనకి అరగదు అందుకే మనకి అలవాటైన ఒక రొటీన్ క్లైమాక్స్ తప్పదు . మొత్తంగా ఏదో ఒక కొత్త సినిమా చూసాం అన్న త్రిప్తి మనకి రాదు. కాని మనం ట్రైలర్ చూసి ఇదే ఇలాగే ఉంటుంది అని ఫిక్స్ అయితే ..ఈ సినిమా మీ అంచనాలని నిజం చేస్తుంది .
చివరగా ...
పరిక్షలు అయిపోయాక ఎన్టీఆర్ సినిమా ధియేటర్ లో ఉంటె ఇంట్లో ఎందుకు ఉంటాం చెప్పండి . కథ లో సూపర్ కొత్త దనం లేకపోయినా కామెడీ బాగా క్లిక్ అయ్యింది . తాతని గుర్తు చేస్తూ ఫాన్స్ ని కూడా ప్రసన్నం చేస్కున్నాడు . మాస్ సినిమా కాబట్టి బాద్షా ముందు "బ్లాక్ బస్టర్ " తగిలించేస్కోవచ్చు .
రేటింగ్
ఆట లాంటి రియాలిటీ షోస్ లో ఒక రొటీన్ స్కోర్ ఉంటుంది జడ్జులు పళ్ళికిలిస్తూ ఇస్తారు ఓ కామన్ స్కోర్ "8" అని .... సో రివ్యూవర్స్ ఇచ్చే కామన్ రేటింగ్ నేను కూడా ఇచ్చెస్తా...
అదేనండినా స్టైల్ లో 65/100
0 comments:
Post a Comment